Saindhav: ‘సైంధవ్’లో జాస్మిన్‌గా ఎవరు చేస్తున్నారో తెలుసా..

ABN , First Publish Date - 2023-04-28T14:38:24+05:30 IST

‘సైంధవ్’ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్న నటి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంతకీ జాస్మిన్‌గా ఇందులో ఎవరు నటిస్తున్నారంటే

Saindhav: ‘సైంధవ్’లో జాస్మిన్‌గా ఎవరు చేస్తున్నారో తెలుసా..
Saindhav Movie Poster

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) 75వ ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైంధవ్’ (Saindhav). నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటిస్తున్న ప్రముఖ నటీనటుల పాత్రలను మేకర్స్ రివీల్ చేస్తూ.. వారి ఫస్ట్ లుక్‌లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్న నటి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంతకీ జాస్మిన్‌ (Jasmine)గా ఇందులో ఎవరు నటిస్తున్నారంటే.. బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ నటి ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah).

ఈ ఫస్ట్ లుక్‌లో ఆండ్రియాని చూస్తుంటే.. ఆమెది ఇందులో చాలా కీలక పాత్ర అనేది అర్థమవుతోంది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో చేతిలో తుపాకీతో ఇంటెన్స్ లుక్‌ (Andrea Jeremiah Look in Saindhav)తో కనిపించింది ఆండ్రియా. పోస్టర్‌లో స్పోర్ట్స్ బైక్‌ను కూడా గమనించవచ్చు. ఇందులో మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఫిమేల్ లీడ్‌లో నటిస్తుండగా.. మరో హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma) పాత్రను డాక్టర్ రేణుగా పరిచయం చేశారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు.

Andrea.jpg

పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘సైంధవ్’ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌ (Vizag)లో జరుగుతోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో నటిస్తోన్న ఇతర నటీనటులను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం డిసెంబర్ 22న క్రిస్మస్ (Christmas) స్పెషల్‌గా విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

*PS2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రత్యేక షోలు రద్దు.. సినిమాపై చిత్రయూనిట్ స్పందనిదే..

*‘PS2’ Twitter Review: ‘బాహుబలి’‌ సరిపోదు.. ఇండియన్ సినిమా గర్వపడే చిత్రమిది

*Agent Twitter Review: అయ్యగారి సినిమా టాక్.. ఏదో తేడాగా ఉందే..?

*Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది

Updated Date - 2023-04-28T14:38:24+05:30 IST