Adivi Sesh: అడివి శేష్ రాక ఆమె జీవితంలో తుఫానును తెస్తుందా?

ABN , First Publish Date - 2023-12-14T15:03:53+05:30 IST

రీసెంట్‌గా శేష్ ఈఎక్స్ శృతి (#SeshEXShruti) అంటూ అడివి శేష్, శృతిహాసన్ కలిసి నటిస్తున్నట్లుగా ఓ అప్‌డేట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి నటిస్తోన్న ఈ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా నుంచి మేకర్స్ గురువారం సెన్సేషనల్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ అడివి శేష్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ రివీల్ పోస్టర్‌తో డిసెంబర్ 18న విడుదల కానుంది.

Adivi Sesh: అడివి శేష్ రాక ఆమె జీవితంలో తుఫానును తెస్తుందా?
Adivi Sesh

రీసెంట్‌గా శేష్ ఈఎక్స్ శృతి (#SeshEXShruti) అంటూ అడివి శేష్ (Adivi Sesh), శృతిహాసన్ (Shruti Haasan) కలిసి నటిస్తున్నట్లుగా ఓ అప్‌డేట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి నటిస్తోన్న ఈ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా నుంచి మేకర్స్ గురువారం సెన్సేషనల్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ అడివి శేష్ గ్రిప్పింగ్ క్యారెక్టర్ రివీల్ పోస్టర్‌తో డిసెంబర్ 18న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన అడివి శేష్ ఇంటెన్స్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫస్ట్ ఇమేజ్‌లో తీక్షణమైన చూపులతో, ముఖాన్ని బ్లాక్ స్కార్ఫ్‌తో కప్పుకొని కనిపించారు అడివి శేష్. అతని కుడి చెవిలో బంగారు చెవిపోగులు, అతని నుదిటిని కప్పి ఉన్న లాంగ్ లాక్స్ లుక్‌కు స్టైల్, స్వాగ్‌ని జోడించాయి. ఆసక్తికరంగా, ఈ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అడివి శేష్ ఫస్ట్ లుక్ చిత్రాన్ని పోస్ట్ చేసి ‘‘#SeshEXShruti తనని పరిచయం చేస్తున్నాము - @adivisesh ❤️‍🔥అతని రాక ఆమె జీవితంలో తుఫానును తెస్తుందా? టైటిల్, ఫస్ట్ లుక్ డిసెంబర్ 18న 🔥’’ అని రాశారు. ‘సినిమాలోని ప్రతి ఫ్రేమ్, డైలాగ్, సన్నివేశాన్ని హిందీతో పాటు తెలుగులో విడివిడిగా చిత్రీకరిస్తున్నాం. ప్రతి భాష సాంస్కృతిక ప్రత్యేకత బట్టి దీనిని విభిన్నంగా ట్రీట్ చేస్తున్నాం’ అని మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు.


Adivi-Sesh.jpg

హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సమర్పణలో సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మిస్తుండగా, అమెరికాలో పుట్టి పెరిగిన షానీల్ డియో (Shaneil Deo) దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’.. బ్లాక్ బస్టర్ విజయంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు చేస్తున్న మెగా ప్రాజెక్ట్ అడివి శేష్‌కు రెండో స్ట్రయిట్ హిందీ మూవీ కానుంది. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు గతంలో డీవోపీగా పనిచేసిన షానీల్‌కు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్‌కు ఆయన దర్శకత్వం వహించారు. సునీల్ నారంగ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడికానున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Kushee Ravi: ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం..

**********************************

*Salaar: ‘సూరీడే..’ పాట.. ‘సలార్’ స్ట్రెంత్ ఇది

*************************************

*Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!

*****************************************

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రెండో గీతం ఎలా ఉందంటే..

*****************************************

Updated Date - 2023-12-14T15:03:54+05:30 IST