సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా?

ABN, First Publish Date - 2023-06-03T16:10:36+05:30

‘ఆదిపురుష్’ సినిమాపై ఉన్న ఇష్టంతో ఆ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన అజయ్-అతుల్ ద్వయంలోని అతుల్.. ఓ సాహసానికి సిద్ధమయ్యారు. ముంబై నుంచి బైక్ రైడ్ ద్వారా ఆయన తిరుపతి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. 3న ముంబైలో బయలుదేరి 5న తిరుపతికి చేరుకుని వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత 6న ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకానున్నారు.

Adipurush Movie Music Director
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజయ్-అతుల్ (Ajay and Atul) ద్వయం బాలీవుడ్‌లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ (Atul) ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సంగీత విద్వాంసుడు బైక్‌పై ముంబై నుంచి తిరుపతి (Mumbai to Tirupathi)కి వెళ్లనున్నారు. అవును, నిజంగా నిజం. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా ముంబై నుంచి బైక్‌పై ప్రయాణించి తిరుపతి రావాలని నిశ్చయించుకున్నారు. అలా ఎందుకో తెలుసా? ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Adipurush Pre Release Event) తిరుపతిలో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు ఇలాంటి సాహసానికి పూనుకున్నారీ మ్యూజిక్ డైరెక్టర్.

అతుల్ జూన్ 3న ముంబైలో బయలుదేరి జూన్ 5న తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతి చేరుకున్న తర్వాత, అతుల్ ఆయన సోదరుడు అజయ్‌తో కలిసి ఆ వేంకటేశ్వరుని పాదాల వద్ద జై శ్రీరామ్ (Jai Sriram) పాటను సమర్పించనున్నారు. వేంకటేశ్వర స్వామి, శ్రీ రాముడు కూడా ఆ విష్ణుమూర్తి అవతారాలే కాబట్టి ఆయన్ని దర్శించుకుని సినిమాకు మంచి చేయాలని కోరుకోనున్నారు. మరోవైపు ప్రభాస్ మరియు ఆదిపురుష్ అభిమానులు తిరుపతిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నగరంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే అక్కడివారు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఇక అతుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయనున్నారు. సాధారణంగా, ఇలాంటి పనులు బైక్ రైడర్స్ (Bike Riders) చేస్తూ ఉంటారు. అయితే సంగీత రంగంలో తొలిసారిగా ఓ సంగీత విద్వాంసుడు (Music Director) సినిమాపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఈ విధంగా ముంబై నుంచి తిరుపతికి బైక్ రైడ్ చేయబోతుండటం విశేషం. ఇక ఇలాంటి వెరైటీ ప్రమోషన్స్ కూడా ఆదిపురుష్ సినిమాకి కలిసొస్తుందనేలా ప్రభాస్ అభిమానులు (Prabhas Fans), నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

************************************************

*Varun-Lavanya: కొడుకు పెళ్లి వార్తలపై నాగబాబు అలా!.. సోషల్ మీడియాలో వరుణ్ ఇలా!

*PedaKapu1: ‘పెదకాపు1’.. శ్రీకాంత్ అడ్డాల ఈసారి డైరెక్ట్ అటాక్

*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

Updated Date - 2023-06-03T16:10:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!