సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు

ABN, First Publish Date - 2023-06-21T20:00:46+05:30

హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయినట్లుగా ‘ది కానిస్టేబుల్’ చిత్ర దర్శకుడు ఆర్యన్ సుభాన్ తెలిపారు. మంగళవారం చిత్ర షూటింగ్ నిమిత్తం.. ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా.. వరుణ్ సందేశ్‌ కాలికి గాయం అయిందని, డాక్టర్లు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో.. సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర దర్శకనిర్మాతలు అధికారికంగా తెలియజేశారు.

Hero Varun Sandesh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసలే అరకొర అవకాశాలతో.. ఎలాగోలా బండి లాక్కొస్తున్న హీరో వరుణ్ సందేశ్‌ (Varun Sandesh)కు కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్‌ (Bigg Boss)లో సందడి చేసినా కూడా.. వరుణ్ సందేశ్‌పై పెద్దగా ఎవరూ ఫోకస్ పెట్టడం లేదు. రాక రాక అవకాశం వస్తే.. అందులోనూ ఇప్పుడు ఆయనకు యాక్సిడెంట్ (Accident) అయినట్లుగా తెలుస్తుంది. ఆయన హీరోగా రూపుదిద్దుకుంటోన్న ‘ది కానిస్టేబుల్’ (The Constable) చిత్ర షూటింగ్‌లో వరుణ్ సందేశ్‌కు యాక్సిడెంట్ అయినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్యన్ సుభాన్ SK (Aryan Subhan SK) దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. బలగం జగదీష్ (Balagam Jagadeesh) నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించి జరుగుతున్న ఫైటింగ్ సన్నివేశంలో హీరో వరుణ్ సందేశ్‌ కాలికి బలమైన గాయాలు అయినట్లుగా చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనని డాక్టర్ల దగ్గరకి తీసుకుని వెళ్లగా.. గాయానికి కట్టు కట్టి.. సుమారు వరుణ్‌ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. వరుణ్ సందేశ్‌ కాలికి గాయం కావడంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని దర్శకుడు తెలిపారు. శంకరపల్లి దగ్గరలోని టంగుటూరు గ్రామంలో జరుగుతున్న చిత్ర షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. (The Constable Shooting Postponed)

‘ది కానిస్టేబుల్’ విషయానికి వస్తే.. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని 40 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు. చిత్ర ప్రారంభోత్సవ సమయంలో ఈ సినిమా గురించి వరుణ్ సందేశ్ (Hero Varun Sandesh) మాట్లాడుతూ.. ఈ తరహా చిత్రం తను ఇంతకు ముందెన్నడూ చేయలేదని, ఒక ఎమోషనల్ కానిస్టేబుల్ పాత్రలో ఇందులో నటిస్తున్నానని, దర్శకుడు చెప్పిన కథ, కథనం తననెంతగానో ఆకట్టుకున్నాయనీ, ఈ చిత్రంలో నటిస్తుండటం తనకెంతో ఆనందం కలిగిస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Regina: ‘రెజీనా’ కోసం ఈ హీరోయిన్ చేసిన సాహసం ఏంటో తెలుసా?


**************************************

*Natti Kumar: పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి చేసిన విమర్శలపై నట్టికుమార్ ఫైర్


**************************************

*Adipurush: డైరెక్టర్‌దే కాదు.. 50 శాతం ప్రభాస్ తప్పు కూడా ఉంది.. నటి సంచలన వ్యాఖ్యలు

**************************************

*Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్‌ సీన్‌.. రచ్చ రచ్చ అవుతోంది

**************************************

*Chiranjeevi: పాప పుట్టిన ఘ‌డియ‌లు చాలా మంచివి.. ఆ ప్రభావం కనిపిస్తుంది

**************************************

Updated Date - 2023-06-21T20:26:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!