YRF: హాలీవుడ్‌ని ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఆ ఇద్దరు స్టార్స్ కొట్టుకుంటే చూడాలని..

ABN , First Publish Date - 2023-04-06T12:52:13+05:30 IST

ఇటీవలికాలంలో పలువురు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.

YRF: హాలీవుడ్‌ని ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఆ ఇద్దరు స్టార్స్ కొట్టుకుంటే చూడాలని..
Tiger Vs Pathaan

ఇటీవలికాలంలో పలువురు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అందులో ప్రతి హీరోకి తనకంటూ ప్రత్యేకంగా సినిమా ఉంటుంది. అనంతరం ఆ క్యారెక్టర్స్ ఓ సినిమాలో కలుస్తాయి. దీన్ని మొదట హాలీవుడ్‌లో ప్రారంభించారు. అక్కడే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మార్వెల్ స్టూడియోస్, డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ పేరుతో డీసీ వేరు వేరుగా అలాంటి చిత్రాలను తెరకెక్కించాయి. ఆ ట్రెండ్ ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలకి కూడా పాకింది. ఇప్పటికే టాలీవుడ్‌లో శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ‘హిట్’ చిత్రాల సిరీస్‌తో ‘హిట్ యూనివర్స్‌’ని, ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలతో తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజు ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ని ప్రారంభించారు. తాజాగా దాన్నే ఫాలో అవుతూ.. బాలీవుడ్‌లోనూ ప్రత్యేకంగా సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైంది.

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మాణంలో ‘టైగర్’ (Tiger), ‘టైగర్ 2’, ‘వార్’ (War), ‘పఠాన్’ (Pathaan) చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలన్నింటినీ కలిపి ప్రత్యేకంగా ‘వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్’ (YRF Spy Universe) అనే ఓ సినిమాటిక్ యూనివర్‌ని క్రియేట్ చేశారు. ఈ సిరీస్‌లో భాగంగా త్వరలో ‘టైగర్ 3’, ‘వార్ 2’ తెరకెక్కనున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ భాగంగా కాగా.. త్వరలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘వార్ 2’ చిత్రం ద్వారా ఈ యూనివర్స్‌లో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. (Tiger vs Pathaan)

Read Also:

Game Changer: బాబాయ్ ఛాన్స్‌ని కొట్టేసిన అబ్బాయ్.. రామ్‌చరణ్‌కి ఎవరి వల్ల సెట్ అయ్యిందంటే..

Nayanthara: తన పిల్లల పూర్తి పేర్లు చెప్పేసిన నయన్.. ఇవేం పేర్లంటూ..

కాగా.. తాజాగా ‘వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్’ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగా.. ‘టైగర్ వర్సెస్ పఠాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు వైఆర్ఎఫ్ సిద్ధమవుతోంది. ఈ మూవీలో టైగర్‌గా సల్మాన్ ఖాన్, పఠాన్‌గా షారుఖ్ ఖాన్ పోటీ పడనున్నారు. అంతేకాకుండా.. ఈ చిత్రానికి ‘వార్’, ‘పఠాన్’ చిత్రాలతో సూపర్ హిట్స్ సాధించిన సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anan) దర్శకత్వం వహించినున్నాడని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మూవీ షూటింగ్ జనవరి 2024న ప్రారంభమవనున్నట్లు అందులో రాసుకొచ్చాడు.

అయితే.. ‘పఠాన్’ సినిమాలో ఓ సీన్‌లో షారుఖ్ ఖాన్‌కి సహాయం చేసేందుకు సల్మాన్ ఖాన్ వస్తాడు. ఆ సీన్‌ని సిద్ధార్థ్ హ్యాండిల్ చేసిన విధానానికి బాలీవుడ్ ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. దీంతో పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో ఈ ఇద్దరు స్టార్లని సిద్ధార్థ్ ఎలా చూపిస్తాడో చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా.. హాలీవుడ్ తరహాలో ఈ ఇద్దరు స్టార్ల మధ్య ఏదైనా ఫైట్ పెట్టే అవకాశం ఉందా అని కూడా చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Adipurush: మరోసారి చిక్కుల్లో ప్రభాస్ మూవీ.. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ..

Bholaa: సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న బాలీవుడ్ స్టార్!?

Updated Date - 2023-04-06T12:52:14+05:30 IST