Shubman Gill: సారా అలీ ఖాన్ కాదు.. ఆ హీరోయినే నా క్రష్..

ABN , First Publish Date - 2023-03-06T20:44:04+05:30 IST

ఇండియన్ క్రికెటర్ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఆటతో పాటు చూడచక్కటి రూపంతోనూ ఆకట్టుకుంటాడు. ఈ క్రికెటర్‌కు అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కొన్ని రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ (Sara Ali Khan) తో శుబ్‌మ‌న్ దర్శనమిచ్చాడు.

Shubman Gill: సారా అలీ ఖాన్ కాదు.. ఆ హీరోయినే నా క్రష్..

ఇండియన్ క్రికెటర్ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఆటతో పాటు చూడచక్కటి రూపంతోనూ ఆకట్టుకుంటాడు. ఈ క్రికెటర్‌కు అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కొన్ని రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ (Sara Ali Khan) తో శుబ్‌మ‌న్ దర్శనమిచ్చాడు. ఎయిర్ పోర్టుతో పాటు ఓ హోటల్‌లో జంటగా కనిపించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని రూమర్స్ షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్ శుబ్‌మన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన క్రష్ ఎవరో చెప్పాడు.

Rashmika Mandanna.jpg

శుబ్‌మన్‌ గిల్‌ తాజాగా మీడియాతో ఆసక్తికర కబుర్లను పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో మీ క్రష్ ఎవరు..? అనే ప్రశ్న అతడికి ఎదురైంది. తొలుత అతడు సమాధానం చెప్పేందుకు తటపటాయించాడు. అయినప్పటికీ సమాధానమిచ్చాడు. ‘పుష్ప’ సినిమాతో భారత్ అంతటా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అంటే తనకిష్టమని తెలిపాడు. రష్మికనే తన ఆల్‌టైం ఫేవరేట్‌గా పేర్కొన్నాడు. శుభ్‌మన్ గతంలో సచిన్‌ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌‌తో ప్రేమయాణాన్ని నడిపాడు. ఏమైందో తెలియదు కానీ ఇద్దరికి బ్రేకప్ అయింది. అనంతరం సారా అలీఖాన్‌తో అతడు డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-07T16:27:40+05:30 IST