సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

ABN, First Publish Date - 2023-05-04T19:44:37+05:30

ఎలాగూ అందరికీ తెలిసిపోయింది కదా.. అని వారు కూడా పబ్లిగ్గానే అన్ని పనులు చేస్తున్నారు. అన్ని పనులు అంటే పెడార్థాలు తీస్తారేమో.. అంటే కలిసి

Parineeti Chopra and Raghav Chadha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ చద్దా (Raghav Chadha)ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు (Marriage) ఎక్కబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ ప్రేమలో ఉన్నామనికానీ, డేటింగ్ చేస్తున్నామనీ కానీ ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ ఇద్దరూ ఈ మధ్య విరివిగా కలిసి కనిపిస్తున్నారు. దీంతో వాళ్లు చెప్పకపోయినా.. వారిద్దరి మధ్య వ్యవహారం నడుస్తుందని అందరికీ తెలిసిపోయింది. ఎలాగూ అందరికీ తెలిసిపోయింది కదా.. అని వారు కూడా పబ్లిగ్గానే అన్ని పనులు చేస్తున్నారు. అన్ని పనులు అంటే పెడార్థాలు తీస్తారేమో.. అంటే కలిసి డిన్నర్ చేయడం, పార్టీలు చేసుకోవడమే కాకుండా.. వేల జనాల మధ్య కలిసి క్రికెట్ చూడటం వంటివన్నమాట. తాజాగా వారు ఐపీఎల్ మ్యాచ్‌లో దర్శనమిచ్చారు.

బుధవారం ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)కి, పంజాబ్ కింగ్స్‌ (Punjab Kings)కి మధ్య మొహాలీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ (IPL Match)ను వీక్షించేందుకు వీరిద్దరూ స్టేడియానికి వచ్చారు. స్టేడియంలో ఫొటోలు దిగుతూ, వీడియోలు తీస్తూ ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలని తాజాగా పరిణీతి చోప్రా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో వారిద్దరూ మా బంధం‌పై ఇక సీక్రెట్స్ ఏమీ లేవనేలా క్లారిటీ ఇచ్చేశారనే విధంగా ఇప్పుడు వార్తలు పుట్టుకొస్తున్నాయి.

ఇదిలా ఉంటే వీరిద్దరి నిశ్చితార్థానికి (Parineeti Chopra and Raghav Chadha Engagement) సంబంధించిన న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. పరిణీతి చోప్రా, రాఘవ చద్దాల నిశ్చితార్థం మే 13వ తేదీన ఢిల్లీ (Delhi)లో గ్రాండ్‌గా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు బాలీవుడ్ మీడియా (Bollywood Media)లో వైరల్ అవుతున్నాయి. మే 13న నిశ్చితార్థం ముగించుకున్న ఈ జంట.. అక్టోబర్‌ చివరి వారంలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉన్నట్లుగా వారి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..

*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

Updated Date - 2023-05-04T19:44:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!