Kareena Kapoor: బ్లాక్ బాస్టర్ మూవీకి సీక్వెల్.. హింట్ ఇచ్చిన హీరోయిన్..

ABN , First Publish Date - 2023-03-24T15:41:36+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘త్రీ ఇడియట్స్’ (3 Idiots). షర్మాన్ జోషి (Sharman Joshi), ఆర్. మాధవన్ (R. Madhavan), బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.

Kareena Kapoor: బ్లాక్ బాస్టర్ మూవీకి సీక్వెల్.. హింట్ ఇచ్చిన హీరోయిన్..

బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘త్రీ ఇడియట్స్’ (3 Idiots). షర్మాన్ జోషి (Sharman Joshi), ఆర్. మాధవన్ (R. Madhavan), బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అప్పట్లోనే రూ.200కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందంటూ కొంతకాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వదంతులే నిజం కాబోతున్నట్టు సమాచారం అందుతుంది. సీక్వెల్ సంబంధించి కరీనా కపూర్ హింట్ ఇచ్చారు.

కరీనా కపూర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ఆమిర్ ఖాన్, షర్మాన్ జోషి, ఆర్. మాధవన్ ముగ్గురు హాజరైన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రస్తావించారు. తాను ఆఫ్రికాలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటే ఈ ముగ్గురు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారని తెలిపారు. విలేకరుల సమావేశం గురించి తనకు తెలియదని ఆమె చెప్పారు. ‘‘ఏదో తేడా కొడుతుంది. సీక్వెల్ గురించి వారు ఆలోచిస్తున్నారు’’ అని కరీనా పేర్కొన్నారు. కరీనా పోస్ట్ కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు. చేతన్ భగత్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ పుస్తకం ఆధారంగా ‘త్రీ ఇడియట్స్’ సినిమా రూపొందింది.

షర్మాన్ జోషి కొన్ని నెలల క్రితం ఓ గుజరాతీ సినిమాలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో షర్మాన్, ఆమిర్, మాధవన్ పాల్గొన్నారు. కరీనా కపూర్ ప్రస్తుతం ‘ది క్రూ’ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హన్సల్ మోహతా దర్శకత్వంలోను ఆమె ఓ సినిమా చేయనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-24T15:45:12+05:30 IST