Tiger 3: ‘టైగర్ 3’.. యాక్షన్ ప్రియులకు పండగే.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-11-08T16:54:11+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అత్యధిక యాక్షన్ సీక్వెన్సులున్న చిత్రంగా సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయబోతోంది. ఇందులో ఉన్న 12 యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉంటాయని తాజాగా దర్శకుడు చెప్పుకొచ్చారు.

Tiger 3: ‘టైగర్ 3’.. యాక్షన్ ప్రియులకు పండగే.. ఎందుకంటే?
Salman Khan in Tiger 3

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), కత్రినా కైఫ్ (Katrina Kaif) హీరోహీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’ (Tiger 3). మనీష్ శర్మ (Maneesh Sharma) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అత్యధిక యాక్షన్ సీక్వెన్సులున్న చిత్రంగా సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయబోతోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ గురించి తాజాగా చిత్ర దర్శకుడు మనీష్ శర్మ మీడియాకు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మనీష్ శర్మ మాట్లాడుతూ.. ‘టైగర్ 3’లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ యాక్షన్ పెయిర్ టైగర్ (Tiger) పాత్రలో సల్మాన్ ఖాన్, జోయా (Zoya) పాత్రలో కత్రినా కైఫ్ నటించారు. ఇది వారిద్దరి కథ. వారిద్దరూ కలిసినప్పుడు సంఘర్షణ ఉంటూనే వస్తుంది. వారి మధ్య బంధం పెరిగే కొద్ది ఈ సంఘర్షణ పెరిగిందే కానీ తగ్గలేదు. ‘టైగర్ 3’లో ఈ సంఘర్షణ ఇంకా బలంగా కనిపించనుంది. అందుకు తగినట్లు యాక్షన్ సన్నివేశాలు మెప్పించనున్నాయి. హాలీవుడ్ (Hollywood) యాక్షన్ సినిమాలకు ధీటుగా టైగర్ 3లో సన్నివేశాలు మెప్పించనున్నాయి.


Salman-Khan.jpg

ఈ సినిమాలో సల్మాన్, కత్రినా (Salman and Katrina) పాత్రలు ఎదుర్కొనే సమస్యల్లో ఉండే తీవ్రత వల్ల సినిమా చాలా వేగవంతంగా సాగుతుంది. ఈ మూవీలో 12 అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి (12 Action Sequences). ఇవి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా చేస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. యాక్షన్ ప్రియులకు, అలాగే టైగర్, జోయా ఫ్యాన్స్‌కైతే ఇదొక ట్రీట్‌లా ఉంటుంది. ఐమ్యాక్స్‌లో ఈ యాక్షన్ సీన్స్‌ అబ్బురపరుస్తాయని తెలిపారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ ‘టైగర్ 3’ చిత్రం నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

========================

*Prabhu Deva Brother: అద్దె వివాదం.. ప్రభుదేవా సోదరుడు చేసిన పనికి పోలీసులు షాక్

*************************************

*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

*************************************

*NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది

*************************************

Updated Date - 2023-11-08T16:54:12+05:30 IST