Prabhu Deva Brother: అద్దె వివాదం.. ప్రభుదేవా సోదరుడు చేసిన పనికి పోలీసులు షాక్

ABN , First Publish Date - 2023-11-08T16:16:57+05:30 IST

అద్దె విషయంలో తలెత్తిన తగాదాలో ఇంటి యజమాని అయిన నటుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్.. ఆ ఇంటి తాళానికి వెల్డింగ్‌ చేయించారు. ఈ సంఘటన అడయార్‌ స్థానిక తేనాంపేటలో చర్చనీయాంశంగా మారింది. లీజు దారుడు విఘ్నేష్ ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగేంద్రప్రసాద్ చేసిన పని చూసి షాక్ అయినట్లుగా సమాచారం.

Prabhu Deva Brother: అద్దె వివాదం.. ప్రభుదేవా సోదరుడు చేసిన పనికి పోలీసులు షాక్
Prabhu Deva Brother Nagendra Prasad

అద్దె విషయంలో తలెత్తిన తగాదాలో ఇంటి యజమాని అయిన నటుడు ప్రభుదేవా సోదరుడు (Prabhu Deva Brother) ఒకరు ఆ ఇంటి తాళానికి వెల్డింగ్‌ చేయించారు. ఈ సంఘటన అడయార్‌ స్థానిక తేనాంపేటలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసి పోలీసులు కూడా షాక్ అయినట్లుగా సమాచారం. స్థానిక టి.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో మేనేజరుగా పనిచేసే విఘ్నేష్‌ (Vignesh)... 2021లో ప్రభుదేవా సోదరుడు నాగేంద్రప్రసాద్‌ (Nagendra Prasad)కు చెందిన ఇంటిని రూ.25 లక్షలు చెల్లించి, లీజుకు తీసుకున్నారు. అలాగే ప్రతి నెలా రూ. 36 వేలు అద్దె ఇస్తానని చెప్పి.. గత కొన్ని నెలలుగా నెలవారీ అద్దె ఇవ్వకపోవడంతో నాగేంద్ర ప్రసాద్‌ ఇంటిని ఖాళీ చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. కానీ రూ. 25 లక్షలు ఇచ్చామని.. ఇంటిని ఖాళీ చేయడం జరగదని విఘ్నేష్ కోర్టును ఆశ్రయించగా కేసు పెండింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో నాగేంద్ర ప్రసాద్‌ సోమవారం సాయంత్రం ఆ ఇంటి తాళానికి వెల్డింగ్‌ చేయించారు. ఈ సమాచారం తెలుసుకున్న విఘ్నేష్‌ మంగళవారం తన ఫ్యామిలీతో సహా ఇంటికి వచ్చి.. ఇదేంటని అడుగగా.. నాగేంద్రప్రసాద్ తన స్నేహితులను తీసుకుని వచ్చి బెదిరించినట్లుగా సమాచారం. దీంతో మంగళవారం విఘ్నేష్ తన కుటుంబంతో కలిసి బయటే ఉండాల్సి రావడంతో.. స్థానిక తేనాంపేట పోలీసులకు ఆశ్రయించాడు. (Nagendra Prasad House Rent Issue)


Nagendra-Prasad.jpg

నాగేంద్రప్రసాద్ చేసిన పని చూసి షాకైన పోలీసులు (Police).. ఆ వెంటనే వెల్డింగ్ చేయించిన తాళాన్ని పగలకొట్టి విఘ్నేష్ మరియు అతని ఫ్యామిలీని ఇంట్లోకి పంపించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరిని పిలిచి విచారణ జరపగా.. తను చెల్లించిన రూ. 25లక్షల లీజు మొత్తాన్ని ఇచ్చేస్తే.. ఇల్లు ఖాళీ చేస్తానని విఘ్నేష్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం.


ఇవి కూడా చదవండి:

========================

*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

*************************************

*NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది

*************************************

*Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

*************************************

Updated Date - 2023-11-08T16:16:58+05:30 IST