కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?

ABN, Publish Date - Dec 23 , 2023 | 06:08 PM

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో చేసిన సినిమా ‘యానిమల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్‌కి మదర్‌గా చేసిన చారూ శంకర్.. ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె తన వయసు, హీరో వయసుల గురించి చెప్పుకొచ్చింది.

Charu Shankar with Ranbir and Anil Kapoor

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ (Ranbir Kapoor)తో చేసిన సినిమా ‘యానిమల్’ (Animal). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతున్న ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వస్తోంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, సన్నీ డియోల్, తృప్తి డుమ్రి.. ఇలా ప్రతి పాత్ర గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ కథకి కీలక పాత్రధారి అయిన అనిల్ కపూర్‌కి భార్యగా, హీరో రణబీర్ కపూర్‌కి తల్లిగా నటించిన చారూ శంకర్ (Charu Shankar) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం లేకపోలేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ‘యానిమల్’ సినిమా (Animal Movie)కు సంబంధించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో ఆమె రివీల్ చేసిన ఓ పాయింట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఆ పాయింట్ ఏమిటని అనుకుంటున్నారా..?

‘యానిమల్’ సినిమాలో హీరోగా చేసిన రణబీర్ కపూర్ వయసు (Ranbir Kapoor Age), అతనికి తల్లిగా చేసిన చారూ శంకర్ వయసు కంటే ఒక సంవత్సరం మాత్రమే తక్కువ. షాకింగ్‌గా ఉందా? ఈ విషయం స్వయంగా చారూ శంకరే తెలిపారు. దీంతో ఆమె బాలీవుడ్‌లో హీరోలకు సరిసమానమైన, లేదంటే ఒక సంవత్సరం అటు, ఇటుగా తల్లి పాత్ర పోషించిన నటీమణుల జాబితాలోకి చేరింది. బాలీవుడ్‌లో ఇది సర్వసాధారణం అనుకోండి. అయినా.. అసలు ఆ విషయమే తెలియకుండా చారూ శంకర్ చాలా గొప్పగా ‘యానిమల్’లో తల్లి పాత్రలో మెప్పించారు. ఇంకా ‘యానిమల్’ గురించి చారూ శంకర్ మాట్లాడుతూ.. (Charu Shankar About Animal)


‘‘యానిమల్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు రణబీర్ తల్లిగా చేయాలని అన్నారు. అయితే రణబీర్‌కు, నాకు.. వయసులో ఒక సంవత్సరం మాత్రమే తేడా. అతనికి 41, నాకు 42. ఒక సంవత్సరం నేను పెద్ద అంతే. అయినా సరే.. సందీప్ రెడ్డి కథ చెప్పిన తర్వాత.. ఇలాంటి పాత్రని ఎందుకు వదులుకోవాలి అని అనిపించింది. వెంటనే ఓకే చేశాను. కథ చెప్పినప్పుడే.. ఈ సినిమాలో మీది కీలక పాత్ర, మీ చుట్టూనే కథ తిరుగుతుందని సందీప్ చెప్పారు. ముందు నన్ను చూడగానే సందీప్ షాకయ్యారు. మీరు మరీ యంగ్‌గా ఉన్నారు.. తల్లి పాత్ర చేయాలి. మీకు ఓకేనా అని అడిగారు. నేను కథ విన్న తర్వాత చెబుతాను అన్నాను. సందీప్ స్టోరీ మొత్తం చెప్పారు. అలాగే ఆర్టిస్ట్‌ల వివరాలు కూడా చెప్పాడు. ఇంత మంచి ఛాన్స్‌ని వయసు గురించి ఆలోచించి వదిలేసుకోవడం ఎందుకు అని అనుకుని.. వెంటనే ఓకే చేశాను..’’ అని చారూ శంకర్ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్

***************************

*Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

*****************************

Updated Date - Dec 23 , 2023 | 06:08 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!