Adipurush: మరో వివాదంలో ప్రభాస్ మూవీ.. తన ఆర్ట్ వర్క్‌ని దొంగిలించారంటూ..

ABN , First Publish Date - 2023-04-09T12:03:22+05:30 IST

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి.

Adipurush: మరో వివాదంలో ప్రభాస్ మూవీ.. తన ఆర్ట్ వర్క్‌ని దొంగిలించారంటూ..
Adipurush in Controversy

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ (Prabhas), సీతగా కృతి సనన్ (Kriti Sanon), లంకేష్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ నిర్మిస్తోంది. అయితే.. ‘ఆదిపురుష్’ మొదలైనప్పటి నుంచి ఈ మూవీ చుట్టూ ఏదో ఒక వివాదం అలుముకుంటూనే ఉంది. గతేడాది టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ వివాదాల పరంపర మొదలైంది. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్లుగానే రిలీజ్‌కి కొన్ని నెలల ముందే గతేడాది సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ని కూడా విడుదల చేసింది. కానీ, ఆ టీజర్‌ చూసిన నెటిజన్లతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ చిత్రం యానిమేటేడ్‌లా ఉందంటూ విమర్శలు చేశారు.

Adipurush.jpg

దీంతో మూవీ టీం చిత్ర విడుదలపై వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలు దిగింది. అలాగే.. జూన్ 16కి సినిమా రిలీజ్‌ని వాయిదా వేసింది. అప్పటికే భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు మరో రూ.100 కోట్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు. వాయిదా వేసిన విడుదల తేది దగ్గర పడుతున్న తరుణంలో శ్రీరామనవమి నాడు సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. దాన్ని చూసి మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ ఓం రౌత్‌పై విమర్శలు చేశారు. కొంచెం కూడా డెవలప్‌మెంట్ లేదని కామెంట్లు చేశారు. అలాగే.. కొత్త పోస్టర్ హిందు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ ముంబైలో ఓ వ్యక్తి కేసు కూడా ఫైల్ చేశారు. తాజాగా మరో వ్యక్తి ఈ చిత్రం యూనిట్‌పై ఆర్ట్ వర్క్‌కి సంబంధించి విమర్శలు చేశాడు. (Adipurush team in Controversy)

Adipurush1.jpg

Also Read - Vivek Agnihotri: జీవితాలను నాశనం చేయడమే మీ అలవాటు.. బాలీవుడ్ దర్శకుడిపై సెటైర్లు

ప్రతీక్ సంఘర్ అనే స్వతంత్ర సృష్టికర్త రెడ్డిట్‌లో తన ఆర్ట్‌వర్క్ స్క్రీన్‌షాట్‌లతో కూడిన పోస్ట్‌ను, చిత్రానికి డిజైనర్ అని చెప్పుకునే వారి ఫేస్‌బుక్ పోస్ట్‌ను షేర్ చేశాడు. అవి రెండు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఆ పోస్టుకి ప్రతిక్.. ‘నేను భారతదేశానికి చెందిన ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌ని. రామాయణ ఇతిహాసం కోసం భగవంతుడు శ్రీరాముని సాధ్యమైన రూపాల కోసం నేను అన్వేషించాను. ఇది దాదాపు ఒక సంవత్సరం క్రితం జరిగింది. అప్పుడు ఆదిపురుష్‌లో పని చేస్తున్న అధికారిక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ నా ఆర్ట్‌వర్క్ మిక్స్‌ని దొంగిలించారని అర్థమైంది. నా ఆర్ట్‌వర్క్ మిక్స్‌తో వారి వర్క్ సరిగ్గా సరిపోయింది. దాని గురించి నాకు ఎటువంటి సమాచారం లేకుండా, అలాగే.. నాకు ఎలాంటి పరిహారం అందించకుండా దానిని వారి సొంతంగా అని ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వారు రాసుకొచ్చారు. ఇలా ఒకరి కళను దొంగతనం చేయడమే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విఫలమవడానికి కారణాలు. దానిపై పని చేసే వ్యక్తులకు ప్రాజెక్ట్ పట్ల ఎలాంటి అభిరుచి లేదా ప్రేమ ఉండదు. పైగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడానికి చౌకైన ఐడియాలు వేస్తున్నారు’ అని ఘాటుగా రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్టుపై కొందరు స్పందిస్తూ.. ‘మీ అద్భుతమైన పనికి ఈ చిత్రబృందం మీకు సరైన క్రెడిట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన సపోర్టుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-09T12:18:45+05:30 IST