దర్శకుడు సుకుమార్ అమెరికాలో జరిగిన
‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ వేడుక లో
పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోను ప్రేమిస్తా
సినిమా అయిపోయిన తర్వాత వాళ్లతో పెద్దగా కనెక్ట్ అయి ఉండను
కానీ, ‘రంగస్థలం’ పూర్తయినా తర్వాత కూడా అనుబంధం కొనసాగిన ఒకే ఒక్క హీరో చరణ్
అతను నా సోదరుడులాంటి వాడు అని సుకుమార్ అన్నారు
మీకొక రహస్యం చెప్పాలి, చిరంజీవిగారితో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చూశా
ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తా. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్
సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గగుర్పాట కలుగుతుంది
రంగస్థలం మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాం
ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది
ఈసారి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా అని సుకుమార్ అన్నారు
Related Web Stories
అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై పోలీస్ కమిషనర్ సంచలన వీడియో విడుదల
హైదరాబాద్ దీవాని.. బాలీవుడ్ కి రాణి
సోయగాలతో కుర్రాళ్లను కుదేల్ చేస్తోన్న బ్యూటీ..
గ్లామర్ డోస్ పెంచిన ఉప్పెన బ్యూటీ..