భూమి పెడ్నేకర్‌ బోల్డ్ బ్యూటీ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు

సినిమాల్లో బలమైన పాత్రలు పోషించే ఆమె పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు

సొసైటీలో ఉన్న సమస్యలపై గొంతెత్తి మాట్లాడతారు

అలాగే హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు

తాజాగా భూమి పెడ్నేకర్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు

జెనీవాలో జరిగిన ప్రతిష్ఠాత్మక యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ సమ్మిట్‌ 2025లో ఆమె పాల్గొన్నారు

ఈ సమ్మిట్‌తో పాల్గొన్న తొలి భారతీయ నటిగా భూమి నిలిచారు

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్త సవాళ్లను చర్చించి అర్థవంతమైన మార్పును తీసుకురావడానికి  కృషి చేశారు

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించే వేదికలో నేనూ భాగం కావడం గర్వంగా ఉందాని, ఇది కొత్త ప్రేరణను ఇచ్చిందన్నారు

ప్రస్తుతం ఆమె ‘దల్దాల్‌’ వెబ్‌ సిరీస్‌లో పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు