‘మళ్లీ పెళ్లి’.. సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి ఫొటోలు వైరల్

హీరో సిద్ధార్ద్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ఇటీవల తెలంగాణలోని

వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి వారిద్దరూ పెళ్లి చేసుకుని వార్తలలో నిలిచారు.

ఈ విషయం వారు షేర్ చేసిన ఫొటోలను చూస్తే తెలుస్తోంది.

అప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట..

ఇప్పుడు రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నట్లుగా

ఈ ఫొటోలను చూస్తుంటే అర్థమవుతోంది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆ ఫొటోలు చూసేయండిక..