బాగా మసాజ్‌ చేస్తే చాలు..: సారా అలీఖాన్‌

ఫోమ్‌ (నురుగ) ఆధారిత ఫేస్‌వాష్‌లు, బాడీవాష్‌లు చలికాలంలో

ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది.

జెంటిల్‌, క్రీమ్‌ తరహా క్లెన్సర్లు వంటివి ఉపయోగిస్తే 

చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చు. 

షాంపూ బదులుగా అప్పుడప్పుడు డ్రై షాంపూతో 

అంటే శీకాకాయ పొడితో గానీ, కుంకుడుకాయ పొడితో గానీ తలస్నానం చేస్తే 

శిరోజాలు సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఉంటాయి. 

తద్వారా కురులు ఆరోగ్యంగా ఉంటాయి. 

చలికాలంలో జుట్టు ఫ్రీజీగా మారుతుంది.

గోరువెచ్చని కొబ్బరినూనెను మాడుకి అప్లై చేసి 

బాగా మసాజ్‌ చేస్తే చాలు.. జుట్టు నిగనిగలాడుతుంది.