'తత్కాల్' తొలగిస్తే బిగ్ టికెట్ మూవీస్‌కు ఇబ్బంది!
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:51 PM
సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తరువాత సెన్సార్ కు వెళ్తున్నారు చాలామంది... అలాంటి ప్రాక్టీస్ ను సెన్సార్ ఆమోదించకున్నా సినీజనం తమకు అనువుగా మలచుకున్నారు... ఆ తరహా పద్ధతికి ఇక చెక్ పెట్టనున్నారట...
1సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి తర్వాత సెన్సార్ కు వెళ్తున్నారు చాలామంది... అలాంటి ప్రాక్టీస్ ను సెన్సార్ ఆమోదించకున్నా సినీ జనం తమకు అనువుగా మలచుకున్నారు... ఆ తరహా పద్ధతికి ఇక చెక్ పెట్టనున్నారట...
నిర్మాతల బాగు కోసమే...
ఈ మధ్య చాలా సినిమాలు 'లాస్ట్ మినిట్ సెన్సార్'తోనే బయట పడుతున్నాయి... అదేమిటంటే కొందరు చివరి నిమిషం దాకా తమ చిత్రాలను చెక్కుతూ ఉన్నారు... అసలు సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా సినిమా డేట్ ప్రకటించరాదు అన్న నిబంధన ఉంది... దానిని సినీ జనం ఎప్పుడో పక్కకు నెట్టేశారు... వాస్తవానికి ఓ సినిమా సెన్సార్ కు వెళ్ళడానికి సదరు చిత్రం పూర్తయిన వెంటనే అప్లై చేసుకుంటే ఏలాంటి తంటా ఉండదు... ఎందుకంటే ఒకవేళ ఆ సినిమాలో సెన్సార్ అభ్యంతర పెట్టిన సీన్స్ ఏవైనా ఉంటే, వాటిని తొలగించి, వాటి స్థానంలో అభ్యంతరం లేని సన్నివేశాలను చొప్పించవచ్చు... అంతేకాదు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి, అడ్వాన్స్ బుకింగ్ ఇస్తే మరో ప్రాబ్లమ్ ఉంది... అలా రిలీజ్ చేయాలనుకున్న సినిమాకు సెన్సార్ ఒకవేళ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిందనుకుంటే, అప్పుడు ఖచ్చితంగా 18 ఏళ్ళలోపు పిల్లలకు ప్రవేశం ఉండదు... దీనివల్ల అంతకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో పిల్లల కోసం బుక్ చేసిన టిక్కెట్లు వేస్ట్ అవుతాయి... వీటిని దృష్టిలో పెట్టుకొని సినిమా జనం సెన్సార్ కు తమ చిత్రాలను లెవంత్ అవర్ లో కాకుండా కొద్ది రోజులు ముందుగానే పంపితే మంచిదని పరిశీలకులు భావిస్తున్నారు... అందువల్లే ఇకపై చివరి నిమిషంలో సెన్సార్ విధానానికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ భావిస్తోంది...
తత్కాల్ స్కీమ్‌కు టాటా!?
వాయిస్ 2: పాత రోజుల్లో ఓ సినిమాను సెన్సార్ చేయించాలంటే కనీసం నెల రోజులు ముందుగా సెన్సార్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది... తరువాత బోర్డ్ సదరు అప్లికేషన్ చేసిన వారికి ఓ డేట్ ఇచ్చేది... ఆ తేదీనే ఆ సినిమావాళ్ళు తమ చిత్రం సెన్సార్ చేయించుకోవాలి... లేని పక్షంలో ఆ వెనకాల ఉన్న నంబర్ కు చెందిన మరో సినిమా వారికి ఛాన్స్ వచ్చేది... అంతకు ముందు నంబర్ వచ్చిన వారు మరో డేట్ చూసుకోవాల్సి వచ్చేది... నిర్మాతలకు ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తరువాత కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి... ఈ మధ్య సినిమావాళ్ళకు వెసలు బాటు కల్పిస్తూ 'తత్కాల్ స్కీమ్' అంటూ ఓ విధానాన్ని 2024లో ప్రవేశ పెట్టారు... దీని ద్వారా రిలీజ్ డేట్ కు ఐదు రోజుల ముందు స్లాట్ పొందే అవకాశం లభించింది... అయితే అనేక మంది నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్ దగ్గర పడ్డ సమయంలో సెన్సార్ కు అప్లై చేస్తున్నారు... దీనివల్ల సెన్సార్ బోర్డ్ ముందు ఒకే సీజన్ లో రిలీజయ్యే సినిమాలు గంపగుత్తగా వచ్చి పడుతున్నాయి... అప్పుడు సెన్సార్ బోర్డ్ సదరు చిత్రాల్లోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించమంటే నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు... అక్కడ ఆలస్యమయ్యే సరికి, వారి చిత్రాలకు సెన్సార్ బోర్డ్ సమస్యలు తలెత్తాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు... ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికే అన్నట్టు ఇకపై 'తత్కాల్' స్లాట్స్ ను తొలగించాలని కేంద్ర సమాచార, ప్రశార శాఖ నిర్ణయించింది.
బిగ్ టిక్కెట్స్ కు ఇబ్బంది...
వాయిస్ 3: 'తత్కాల్ స్కీమ్'ను ఎక్కువగా బిగ్ టికెట్ మూవీస్ వినియోగించుకుంటున్నాయి... ఒకవేళ 'ప్రయారిటీ స్కీమ్'ను తొలగిస్తే రాబోయే భారీ బడ్జెట్ మూవీస్ కు సెన్సార్ సర్టిఫికెట్ పొందడం కష్టతరమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు... దీనిపై నిర్మాతలు, దర్శకుల అభిప్రాయాలను రీజనల్ సెన్సార్ ఆఫీసర్స్ సేకరించాలనీ సమాచార, ప్రసార శాఖ ఆదేశించింది... ఇందులోని సాధ్యాసాధ్యాలను మార్చి 17లోగా తెలియజేయాలనీ సూచించింది... మరి ఈ విషయంలో సెంట్రల్ సెన్సార్ బోర్డ్ వారికి ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుతుందో? దానిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి...