Irumudu: ‘ఇరుముడి’ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Aug 03 , 2026 | 11:52 AM
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' విడుదలకు సిద్ధమవుతోంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి 'యాలాలో యాలాలో.. వెన్నెల్లో ఎన్నెన్ని ముచ్చట్లో..' అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. దీనికి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Updated at - Aug 03 , 2026 | 11:58 AM