Varun Tej: ప్రభాస్ వదిలిన 'కొరియన్ కనకరాజు' టీజర్
ABN, Publish Date - Jul 13 , 2026 | 04:07 PM
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు' టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు'. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ తో ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. మరింత అంచనాలు పెంచుతూ సోమవారం ఈ సినిమా టీజర్ను ప్రభాస్ విడుదల చేశారు.
టీజర్‌లో వరుణ్ తేజ్ స్టైలిష్, రఫ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. హారర్, కామెడీ, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. కొరియన్ కల్చర్, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, థ్రిల్లింగ్ విజువల్స్, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ట్రీట్, వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.