సరస్వతి ట్రైలర్ : ప్రతి అమ్మాయి సరస్వతిలా ఉండదు.. కాళీలాగా కూడా మారుతుంది
ABN, Publish Date - Feb 21 , 2026 | 11:55 AM
వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’ (Saraswathi). ప్రకాశ్ రాజ్, ప్రియమణి, కిశోర్, రావు రమేష్, మురళీ శర్మ కీలక పాత్రధారులు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నాని విడుదల చేశారు (Saraswathi Trailer). ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌లో చూపించారు. 'ఈ కేసు గెలవడం చాలా కష్టమని లాయర్ చెప్పడం, ఆడదానికి పుట్టవా.. అడవి జంతువుకు పుట్టావా? అని ప్రియమణి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.