సమంతను ఆడేసుకున్న వెన్నెల కిషోర్
ABN, Publish Date - Apr 25 , 2026 | 09:58 PM
సమంత కథానాయికగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.
సమంత కథానాయికగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు మేకర్స్. ప్రచారంలో భాగంగా సమంతను వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ చేశారు. సినిమా గురించి ప్రశ్నలు అడుగుతూ సమంత జవాబు ఇచ్చేలోపు మరో ప్రశ్న అడగటం చేసి సరదాగా ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు.