‘వసుదేవసుతం’కు ‘లవ్‌లీ’ హీరో సపోర్ట్.. ఏం చేశారంటే
ABN, Publish Date - Jul 05 , 2026 | 08:10 PM
రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు.
రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను (Vykunt Bonu) తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’ (Vasudheva Sutham). ఈ సినిమాలో మహేంద్రన్ (Master Mahendran), అంబికా వాణి జంటగా నటించారు. ఈ సినిమా జూలై 10న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ మరో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను ‘లవ్‌లీ’ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌ని విడుదల చేసిన ఆది.. సాంగ్ చాలా ప్రామిసింగ్ ఉందని, టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
‘ఆనందాల వేళ’ అంటూ వచ్చిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల ఆలపించారు. మణిశర్మ బాణీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. చక్కని సాహిత్యంతో వచ్చిన ఈ పాట.. శ్రోతలను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్‌ను గమనిస్తే ఇదొక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా అనేది అర్థమవుతోంది. అన్ని రకాల అంశాలను జోడించి.. ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి జిజ్జు సన్ని (పార్కింగ్ ఫేమ్) కెమెరామెన్‌గా పని చేశారు. జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ
ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్
ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’