సింగీతం శ్రీనివాసరావు 61వ చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ టీజర్ అదిరింది
ABN, Publish Date - May 01 , 2026 | 10:27 PM
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 61వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేస్తూ.. టైటిల్ టీజర్ వదిలారు.
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సింగీతం, ఇప్పుడు 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్‌లోకి తిరిగి వస్తూ, క్రియేటివిటీకి హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన తన సత్తా ఏంటో చాటారు. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీతో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర టైటిల్‌ని శుక్రవారం అనౌన్స్ చేస్తూ, టైటిల్ టీజర్ కూడా వదిలారు. సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందించేలా రానున్న ఈ చిత్రానికి ‘సింగ్ గీతం’ (Sing Geetham) అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
టైటిల్ టీజర్‌ని గమనిస్తే.. ఒక రహస్యమైన గ్రామం నేపథ్యంలో సాగే ‘సింగ్ గీతం’, ప్రతాప్ అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్ జీవితం అనుకోని మార్గంలోకి ఎలా వెళ్లింది? కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అడుగు పెట్టిన అతను.. అభివృద్ధి, పరిరక్షణ మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకుని, తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. యూనిక్ కాన్సెప్ట్, ఫాంటసీ కథనంతో ‘సింగ్ గీతం’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతుందనేది ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇది సింగీతం శ్రీనివాసరావు వినూత్న ప్రయాణానికి మరో మైలురాయిగా నిలవనుంది.
ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి తమ తమ పాత్రల్లో ఆకట్టుకునే నటన కనబరిచారు. ఫాంటసీకి హాస్యాన్ని మేళవించడంలో సింగీతం ప్రత్యేక శైలి ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా హై స్టాండర్ట్స్‌లో ఉండబోతుందనేది ఈ టీజర్ తెలియజేస్తోంది. అంకూర్ సి సినిమాటోగ్రఫీ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కథకి ప్రత్యేకమైన మూడ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. టైటిల్ టీజర్‌తోనే మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రాన్ని జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!
‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?
Updated at - May 01 , 2026 | 10:27 PM