Singa Title Glimpse: బ్లాక్ పాంథర్‌లా గోపీచంద్ ఎంట్రీ.. గ్లింప్స్ అదిరింది
ABN, Publish Date - Jun 13 , 2026 | 12:09 AM
మ్యాచో హీరో టి. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సింగ’. యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
మ్యాచో హీరో టి. గోపీచంద్ (T Gopichand) హీరోగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సింగ’ (Singa). యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ (V Venkat) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేసి, ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే..
పక్షుల కిలకిలారావాలతో ప్రారంభమైన ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను దట్టమైన అడవి మధ్యలోకి తీసుకెళ్తుంది. ట్రైబల్ నేపథ్య సంగీతం ఆసక్తిని పెంచుతుండగా.. చీకటిలో మెరుస్తున్న రెండు కళ్లను చూస్తే మొదట అడవిలో సంచరిస్తున్న బ్లాక్ పాంథర్ అనిపిస్తుంది. అయితే వెంటనే గోపీచంద్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలి, ప్రతీకారంతో రగిలిపోతున్న బ్లాక్ పాంథర్‌లా కనిపిస్తూ.. పవర్ ఫుల్ ప్రెజెన్స్‌ని చూపించారు. ఆ వెంటనే ‘సింగ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను రివీల్ చేశారు. టైటిల్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
ఈ టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్‌లో ఇందులో గోపీచంద్ ఇందులో కనిపిస్తున్నారు. అభిమానులకు ఇది పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ ఫైట్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకట్ దర్శకుడిగానూ సెన్సేషనల్ హిట్‌ని అందుకోనున్నారనే విషయం.. ఈ గ్లింప్స్‌తోనే తెలిసిపోతోంది. హీరో గోపీచంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సాంకేతికంగానూ ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం రూపొందుతోందని, గోపీచంద్‌ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ నేరేటివ్‌ను సిద్ధం చేశారని మేకర్స్ తెలుపుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!
ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ