‘సింగ్ గీతం’కు శ్రుతి హాసన్ సపోర్ట్.. ఏదో అయిపోయింది!
ABN, Publish Date - Jun 01 , 2026 | 09:33 AM
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘సింగ్ గీతం’ చిత్రానికి అందాల నటి శ్రుతి హాసన్ సపోర్ట్ అందించారు.
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘సింగ్ గీతం’ (Sing Geetham) చిత్రానికి అందాల నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) సపోర్ట్ అందించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాని వార్తలలో నిలుపుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏమైంది’ అనే పాటను శ్రుతి హాసన్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఈ పాటని గమనిస్తే.. ఈ పాట ఒక మ్యూజికల్ పజిల్‌లా సాగుతుంది. ఒక వింత పరిస్థితిలో చిక్కుకున్న గ్రామాన్ని ఈ పాట పరిచయం చేస్తోంది. ఆ గ్రామంలో జరిగే సాధారణ సంభాషణలన్నీ పాటలుగా మారిపోతుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సి వస్తుంది. ప్రశ్నలు, సందేహాలు, ఆశ్చర్యాలన్నీ ట్యూన్స్‌గా మారిపోతూ ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, కథను ముందుకు నడిపిస్తూనే ఎంటర్‌టైన్ చేస్తుండటం. గ్రామస్తుల గందరగోళం, ఆసక్తి, ఆ వింత పరిస్థితికి సమాధానం వెతికే ప్రయత్నం ప్రతి లిరిక్‌లో తెలుస్తుండటం విశేషం.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, గౌతమ్ చల్లగుల్ల, రత్న శ్రీకర్, శశాంక్ చింతలపూడి కలిసి ఈ పాటకు సాహిత్యం అందించడం మరో విశేషం. ఈ పాటను చిత్రంలోని నటీనటులే ఆలపించడంతో పాట మరింత సహజంగా, కథలో భాగంగా అనిపిస్తోంది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 11న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా?
Updated at - Jun 01 , 2026 | 09:33 AM