Maatrubhumi: సరిహద్దులో సైనికుడిగా సల్మాన్.. ఆకట్టుకుంటున్న ‘మాతృభూమి’ ట్రైలర్
ABN, Publish Date - Nov 11 , 2026 | 10:47 AM
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salaman khan) మరోసారి సైనికుడి పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salaman khan) మరోసారి సైనికుడి పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘మాతృభూమి’(Maatrubhumi Trailer) సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులు, మార్పులు, చేర్పుల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్లో సల్మాన్ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడిగా కనిపించారు. మరోవైపు భార్య, పిల్లలతో సంతోషంగా గడిపే కుటుంబ పెద్దగానూ ఆకట్టుకున్నారు. చిత్రాంగదా సింగ్ ఇందులో సల్మాన్ భార్య పాత్రను పోషించారు.
2020లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల ‘మాతృభూమి’గా టైటిల్ మార్చారు. అలాగే సినిమా నిర్మాణంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా దాదాపు 40 శాతం సినిమాను రీషూట్ చేసినట్లు సమాచారం. కథలో కొన్ని కల్పిత అంశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు, పాత్రల నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలను అదనంగా చేర్చి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేశారు.ఇలా పలు మార్పుల తర్వాత విడుదలకు సిద్ధమైన ‘మాతృభూమి’ ట్రైలర్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.