‘రణబాలి’ థియేట్రికల్ ట్రైలర్
ABN, Publish Date - Oct 08 , 2026 | 07:58 PM
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ‘రణబాలి’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.