Powerpeta: ఏంటిప్పుడు సందీప్ కిషన్ సింహమా! గ్లింప్స్ అంతా అదేగా?
ABN, Publish Date - May 08 , 2026 | 01:03 AM
ఇప్పటి వరకు ‘సింహం’ పేరుతో చాలా డైలాగ్స్ వచ్చాయి. ఇప్పుడిక సందీప్ కిషన్ వంతొచ్చింది. నేను కూడా సింహం అంటూ బర్త్‌డే స్పెషల్‌గా సందీప్ కిషన్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
ఇప్పటి వరకు ‘సింహం’ పేరుతో చాలా డైలాగ్స్ వచ్చాయి. ఇప్పుడిక సందీప్ కిషన్ (Sundeep Kishan) వంతొచ్చింది. నేను కూడా సింహం అంటూ బర్త్‌డే స్పెషల్‌గా సందీప్ కిషన్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పవర్ పేట’ (Powerpeta). రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పుట్టినరోజు సందర్భంగా, ‘పవర్‌పేట’ చిత్ర నిర్మాతలు గ్లింప్స్ (Powerpeta Glimpse)తో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ గ్లింప్స్‌ని గమనిస్తే.. థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్‌లో ప్రారంభమైంది. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య హీరో ఎంట్రీ, సిగరెట్ తాగుతూ సింహం గురించి పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పడం అలరించింది. ఆ నేల స్వభావం, దానికి శక్తినిచ్చే మనుషుల గురించి చెబుతూ తన పాత్ర ఇంటెన్స్ చూపించారు. థియేటర్ స్క్రీన్‌పై బాణాసంచా విసిరే సీన్‌తో గ్లింప్స్ మరింత మాస్ ఫీల్‌ను అందించింది. సందీప్ కిషన్ ఈ సినిమాలో రగ్డ్ పీరియాడిక్ అవతార్‌లో కనిపిస్తున్నారు. స్టైలిష్ షేడ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, రా యాటిట్యూడ్‌తో ఆయన లుక్ ఆకట్టుకునేలా ఉంది. ‘సేనాపతి రవి’ అనే పాత్ర పేరును కూడా ఇందులో రివీల్ చేశారు. సందీప్ స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దర్శకుడు కృష్ణ చైతన్య భారీ స్థాయి మాస్ క్యారెక్టరైజేషన్‌ను ఎంత బలంగా డిజైన్ చేశారో ఈ గ్లింప్స్‌లో స్పష్టమవుతోంది. పాత్ర ఎలివేషన్స్, డైలాగ్స్ ఆయన రచయితగా ఉన్న బలాన్ని మరోసారి చాటాయి. సిగరెట్ వెలిగించే చిన్న సీన్ విషయంలో కూడా దర్శకుడి స్టైల్‌ను తెలియజేస్తోంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్‌కు మరింత పవర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లుగా మేకర్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!
తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్
Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను
Updated at - May 08 , 2026 | 01:03 AM