సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ram Charan: ‘పెద్ది’ స్పెషల్‌ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది..

ABN, Publish Date - May 22 , 2026 | 12:58 PM

‘పెద్ది’ సినిమా నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక గీతానికి సంబంధిన అప్‌డేట్‌ వచ్చింది.


‘పెద్ది’ (Peddi) సినిమా నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రత్యేక గీతానికి సంబంధిన అప్‌డేట్‌ వచ్చింది. ‘హలల్లో హలో’ (Peddi Special song) అంటూ సాగే పాట ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్‌ సరసన శ్రుతీహాసన్‌ ఆడిపాడారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు ఇటీవల చెప్పారు. ప్రోమోలో రామ్‌చరణ్‌ డాన్స్‌ స్పీడ్‌కు ఈక్వల్‌గా శ్రుతీ కాలు కదిపి అలరించారు. ఈ పాటను 23న భోపాల్‌లో జరిగే భారీ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - May 22 , 2026 | 02:40 PM