Pocket Rockkets: నిహారిక కొణిదెల కొత్త సినిమా టీజర్ వచ్చేసింది
ABN, Publish Date - Nov 03 , 2026 | 05:48 PM
నిహారిక కొణిదెల నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ మీ మేకర్స్ విడుదల చేసారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా నటిస్తుండగా.. 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమాకు ప్రమోషన్స్ లేవంటూ చిత్ర బృందం ఇటీవల ఓ సరదా వీడియో వదిలిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దీనిపై మీరు ఓ లుక్ వేయండి.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్రేయా కొంతం మాట్లాడుతూ “నాకు ఫీమేల్ ప్రొడ్యూసర్స్ బాగా కలిసివచ్చారు. ఇంతకు ముందు శుభం సినిమా చేశాను. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది" అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ "పాకెట్ రాకెట్స్’ సినిమా నాకు ఒక సర్ప్రైజ్. జులైలో ప్రారంభించిన ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేశాం. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నా జీవితంలో ఒక భాగంలా, ఎంతో ఆసక్తికరంగా సాగిన ప్రాజెక్ట్ ఇది. మా సినిమా డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది' అన్నారు.
ALSO READ:
ENE 2 Trailer: సినిమా హిట్ కాకపోతే ఉరి తీయండి..
‘రామాయణ’.. ఐమ్యాక్స్ ట్రైలర్ చూసేయండి..
Emraan Hashmi: భయానక పాత్రతో వస్తున్న ఒమీ..