‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్.. ఫుల్ ఫన్ వైబ్‌తో అదిరింది

ABN, Publish Date - Aug 29 , 2026 | 01:52 PM

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీ టైటిల్ ట్రాక్‌ని మేకర్స్ వదిలారు.

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu). తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి అదిరిపోయే ‘టైటిల్ ట్రాక్’ను విడుదల చేసింది.

‘ముగ్గురు కోతులు.. ఎన్ని తీట పనులు.. ఎవడి కంటపడకుండా చేస్తూ ఉంటారు వీళ్ళు’, ‘అమీర్‌పేట్‌లో తిరిగే పోరగాళ్లు.. క్రెడిట్ కార్డుతో కొంటారు సిగరెట్లు’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం బ్యాచిలర్ లైఫ్‌ను, సింగిల్స్ చేసే తిక్క పనులను సరదాగా ఆవిష్కరించింది. జగదీష్ బుసయవలస రాసిన క్యాచీ లిరిక్స్‌కు చైతన్య గన్నవరపు తన ఎనర్జిటిక్ వాయిస్‌తో మరింత ఊపు తెచ్చారు. ఎస్. సుహాస్ అందించిన పెప్పీ బీట్స్, ముగ్గురు కుర్రాళ్లు చేసే అల్లరి పనులు యూత్‌కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి రాజ్ నోముల సినిమాటోగ్రాఫర్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫ్రెండ్షిప్, కామెడీ, బ్యాచిలర్ లైఫ్ నేపథ్యంలో పూర్తి స్థాయి నవ్వుల విందుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మున్ముందు మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌తో అలరించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్.. పొలిటికల్ హీట్ పెంచిన పవర్‌ఫుల్ డైలాగ్స్

‘తలైవర్‌’తో సెల్ఫీ.. నమ్మలేని నిజం: కయాదు లోహర్‌

‘King100’ గ్లింప్స్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా

Updated at - Aug 29 , 2026 | 01:52 PM