సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Agadha: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు

ABN, Publish Date - May 07 , 2026 | 10:21 AM

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం  'అగధ'. ఈ సినిమా టీజర్ ను గురువారం విడుదల చేశారు.

కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం  'అగధ' (Agadha). ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ  చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను గురువారం విడుదల చేశారు. విజువల్  ఎఫెక్ట్స్,  గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ , మధ్య మధ్యలో ఆసక్తి రేకెత్తించే  డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా' అని అడిగితే, ఒక అమ్మాయి భయంతో వణికిపోతూ 'అగ్... అగ్... అగధ' అని చెప్పడంతో 'అగధ' అంటే ఎవరు అనే ఆసక్తి కలుగుతుంది. 'అగధ' వచ్చేసిందమ్మా. 'అగధ' ముందు ఎవ్వరి ఆటలు సాగవు. రా... 'అగధా… రా"అంటూ వినిపించే డైలాగ్స్ తో టీజర్ తాలూకు ఉత్కంఠ పీక్ లెవెల్ కి చేరినట్టుగా అనిపిస్తుంది. త్వరలో ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - May 07 , 2026 | 01:18 PM