Gaayapadda Simham Trailer: ట్రంప్‌తో యుద్ధం.. ఏదో జరుగుతోంది?
ABN, Publish Date - Apr 26 , 2026 | 12:45 PM
తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తోన్న న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గాయపడ్డ సింహం’. మే 1న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) హీరోగా నటిస్తోన్న న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గాయపడ్డ సింహం’ (Gaayapadda Simham). ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ (Kasyap Sreenivas) దర్శకత్వంలో రూపుదిద్దుకుని మే 1న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను ఏర్పడేలా చేయగా.. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Gaayapadda Simham Trailer)ను విడుదల చేసి.. సినిమాపై మరింతగా అంచనాలను పెంచేశారు. ఈ ట్రైలర్‌ని గమనిస్తే..
ఒక యువకుడి జీవితంలో జరిగే అనుకోని మలుపు చుట్టూ తిరిగే కథ ఇదని ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలుకనే తను, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా డిపోర్ట్ అవుతాడు. ఆ ఎఫెక్ట్ అతని లైఫ్‌ని ఏ విధంగా టర్న్ చేసింది. అతని కలలు, ప్రేమ, భవిష్యత్.. అన్నీ ఒక్కసారిగా దెబ్బతినడంతో.. అతనేం చేశాడు? తనలో పెరిగే నిరాశ, కోపం అతడిని ఎటువైపు నడిపించింది? అనే అంశాలతో ముడిపడిన ఈ భావోద్వేగ ప్రయాణాన్ని దర్శకుడు సెటైర్, డార్క్ హ్యూమర్‌తో మేళవించి ఆసక్తికరంగా తెరకెక్కించారనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ప్రస్తుత గ్లోబల్ సమస్యను యువతకు కనెక్ట్ అయ్యేలా కథగా మలిచిన తీరు, సూర్య ప్రకాశ్ జ్యోసుల అందించిన కథలోని భావోద్వేగం, వ్యంగ్యం, హాస్యం అన్నీ సమతుల్యంగా కనిపిస్తున్నాయి. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలన్నీ ఇందులో ఉన్నట్లుగా ట్రైలర్ హింట్ ఇస్తోంది. తరుణ్ భాస్కర్ ఒక సాధారణ యువకుడిగా, ఆశలు-నిజాల మధ్య ఇరుక్కుపోయిన పాత్రను చాలా సహజంగా పోషించారు. ఆయన నటనలో భావోద్వేగం, నిరాశ, సరదా.. అన్నీ నేచురల్‌గా పండాయి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి నెగిటివ్ షేడ్‌లో కనిపిస్తూ.. ఇంటెన్స్‌ను పెంచగా, శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలుస్తుంది. ఇక శుభలేఖ సుధాకర్ కెజియఫ్ స్ఫూఫ్ అయితే ఓ రేంజ్‌లో పేలిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే, ఈ సినిమాను చూడాలనే ఇంట్రస్ట్‌ని కలిగించడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
రాజమౌళి వెనక ఉన్న ఫోటోలో ఒక మినీ ప్రపంచమే ఉంది.. చూశారా?
బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?
లెజెండరీ మల్టీస్టారర్ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
Updated at - Apr 26 , 2026 | 12:45 PM