Awarapan 2: శివమ్ పండిట్‌గా ఇమ్రాన్ హష్మీ.. ఆకట్టుకుంటున్న ‘ఆవారాపన్ 2’ ట్రైలర్
ABN, Publish Date - Aug 06 , 2026 | 12:01 PM
బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆవారాపన్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఆవారాపన్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆవారాపన్’ (Awarapan 2) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఆవారాపన్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ((Emraan Hashmi) మరోసారి శివమ్ పండిట్ పాత్రలో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. 2007లో వచ్చిన ‘ఆవారాపన్’ ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ప్రేమ, బాధ, త్యాగం, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇప్పుడు అదే ఎమోషనల్ కంటెంట్ తో ‘ఆవారాపన్ 2’ రూపొందుతోంది.
నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్ ను విడుదల చేశారు. యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో ఇమ్రాన్ హష్మీ పాత్రలోని బాధ, కోపం, ప్రేమ, ప్రతీకారం వంటి కోణాలను చూపించారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.