Fahadh Fassil: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ బాలకృష్ణ వాయిస్‌తో అదిరిపోయింది
ABN, Publish Date - Sep 22 , 2026 | 06:44 PM
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. (Dont Trouble The Trouble) శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మాతలు. ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్నఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.