సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Diviki Diviki song: ‘డివికి డివికి దిక్కుమ్’.. అదిరిన వదిన మరదళ్ల మాస్ స్టెప్పులు

ABN, Publish Date - Nov 21 , 2026 | 12:44 PM

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ నుంచి కొత్త పాట విడుదలైంది

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

అనిల్ రావిపూడి ఇప్పటికే తనదైన శైలిలో సినిమా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘డివికి డివికి దిక్కుమ్’ (Diviki Diviki Dikkum) సాంగ్‌ను విడుదల చేశారు. వదిన, మరదళ్ల మధ్య సాగే ఈ పాట ప్రేక్షకుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి లంగా ఓణీల్లో సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపిస్తూ తమ స్టెప్పులతో అదరగొట్టారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను మధుప్రియ, హరిప్రియ ఆలపించారు. మరి ఈ హుషారైన పాటను మీరు కూడా చూసేయండి.

Updated Date - Nov 21 , 2026 | 01:27 PM