స్టార్స్ విడుదల చేసిన ‘బాలన్ - ది బాయ్’ ట్రైలర్.. చూసేయండి
ABN, Publish Date - Jun 06 , 2026 | 08:15 PM
కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బాలన్ - ది బాయ్’. ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్‌తో ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ని స్టార్స్ రిలీజ్ చేశారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బాలన్ - ది బాయ్’ (Balan The Boy). ఈ చిత్రానికి ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్‌తో ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం (Chidambaram) దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ (Balan The Boy Trailer)ను అన్ని భాషలలోని స్టార్స్ విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘బాలన్ - ది బాయ్’ మూవీ హిందీ ట్రైలర్‌ను అజయ్ దేవగణ్, తమిళ ట్రైలర్‌ను సూర్య, తెలుగు ట్రైలర్‌ను నాగ చైతన్య, కన్నడ ట్రైలర్‌ను రాజ్ బి శెట్టి.. సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ట్రైలర్ తమకు బాగా నచ్చిందని చెబుతూ.. మూవీ టీమ్‌కు ఈ స్టార్ హీరోలు బెస్ట్ విశెస్ తెలిపారు. హ్యూమన్ ఎమోషన్స్, హార్ట్ టచింగ్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆసక్తి కలిగించే సస్పెన్స్, ఎమోషన్ వంటి అంశాలతో ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తోంది. ఇటీవల ఈ మూవీ ఫ్రాన్స్‌లో జరిగిన ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, గ్లోబల్ వేదికపై మంచి రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!
సినిమా రివ్యూ: హీమాన్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్
‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!
Updated at - Jun 06 , 2026 | 08:15 PM