సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Udta Teer: పాకిస్తానీ 'ధురంధర్‌' గతాన్ని మర్చిపోతే...

ABN, Publish Date - Sep 23 , 2026 | 06:45 PM

ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం 'ఉడ్తా తీర్' ట్రైలర్ విడుదలైంది. గతాన్ని మర్చిపోయిన పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్‌ బిలాల్‌ గా ఇందులో ఆయుష్మాన్‌ నటించాడు.

ఆయుష్మాన్ ఖురానా సినిమా అంటేనే నవ్వుల జల్లులు థియేటర్లో జోరుగా కురుస్తాయి. అతని తాజా చిత్రం 'ఉడ్తా తీర్‌' కూడా అందుకు మినహాయింపు కాదు. పాకిస్తాన్ కు చెందిన ఓ అండర్ కవర్ ఏజెంట్‌... భారత దేశానికి వచ్చి... ఓ బాంబు దాడిలో తన గతాన్ని మర్చిపోతాడు. అయితే తనలోని దేశభక్తిని మాత్రం మర్చిపోడు. ఆ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి తాను ఇండియన్‌ కౌంటర్‌- టెర్రరిజం ఆఫీసర్ అనే భావనకు లోనవుతాడు. భారత్‌ లోని పాకిస్తాన్ తీవ్రవాదులను చెడుగుడు ఆడేసుకుంటాడు. అతని ఉల్టా దేశభక్తిని చూసి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు తలలు పట్టుకుంటారు. ఈ సినిమాలో పాకిస్తానీ గూఢచారి బిలాల్‌ గా ఆయుష్మాన్‌ ఖురానా బోలెడంత వినోదాన్ని పంచాడని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. గతంలో ఆయుష్మాన్ ఖురానా సరసన 'పతీ పత్ని ఔర్‌ వో దో' చిత్రంలో నటించిన సారా అలీఖాన్‌ మరోసారి ఇందులో జత కట్టింది. ఇతర ప్రధాన పాత్రలను రామ్ కపూర్‌, రాహుల్ బోస్‌, గుల్షన్ గ్రోవర్, ముకుల్ దేవ్ తదితరులు పోషించారు. ఆకాశ్‌ ఎ కౌషిక్ దర్శకత్వం వహించిన ఈ వినోదాత్మక దేశభక్తి చిత్రం అక్టోబర్ 9న విడుదల కాబోతోంది.

Updated Date - Sep 23 , 2026 | 06:47 PM