అతిగా ఆలోచించకురా అంటున్న 'అనుమాన పక్షి'
ABN, Publish Date - Sep 03 , 2026 | 07:17 PM
రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న 'అనుమాన పక్షి' చిత్రం నుంచి అతిగా ఆలోచించకురా అనే పాట విడుదలైంది. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు.
'డిజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’. రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదే నెల 18న మూవీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘అతిగా ఆలోచించకురా’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా హీరో క్యారెక్టర్‌ను ఫన్‌గా ప్రజెంట్ చేస్తోంది. క్యారెక్టర్ స్వభావాన్ని, అతని ఆలోచనా విధానాన్ని సరదాగా చూపిస్తూ పాట సాగింది. ఈ పాటకు శ్రీచరణ్ పాకాల ఆకట్టుకునే ట్యూన్ సమకూర్చగా, సాన్వి, రవి ప్రకాష్ చోడిమళ్ల దీనిని ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తుండగా, ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.