సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విడుదలైన 'తెరచాప' ట్రైలర్

ABN, Publish Date - Mar 23 , 2026 | 11:38 AM

జోయల్‌ జార్జ్ దర్శకత్వంలో కైలాశ్‌ దుర్గం నిర్మించిన చిత్రం 'తెరచాప' (Therachapa). నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం. ఎల్. రాజా సంగీతాన్ని అందించారు. తాజాగా చిత్ర బృందం 'తెరచాప' ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆహ్లాదకరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మొదలై సముద్ర తీరంలో ఉండే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేదభావాలు ఉండడం కూడా సహజమే. అటువంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితుల పట్ల పోరాడుతున్నట్లు అర్థమవుతుంది.

Updated Date - Mar 23 , 2026 | 11:38 AM