సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suriya-Jyothika: స్కాట్లాండ్ సెలెక్ట్ చేసుకోడానికి కారణమదే.. 

ABN, Publish Date - Sep 21 , 2026 | 12:57 PM

కోలీవుడ్‌లో అన్యోన్యమైన  జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య, జ్యోతిక. తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

కోలీవుడ్‌లో అన్యోన్యమైన  జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య(Suriya), జ్యోతిక (jyothika). తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ప్రత్యేక రోజుల్లో  విదేశీ టూర్లతో, గ్రాండ్ పార్టీలతో జరుపుకుంటుంటారు. అయితే సూర్య–జ్యోతిక మాత్రం తమ ప్రేమకు, అనుబంధానికి మరిన్ని జ్ఞాపకాలు జోడించేలా స్కాట్లాండ్‌ను ఎంచుకున్నారు. అక్కడి ప్రకృతి అందాల మధ్య ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే  స్కాట్లాండ్‌ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జ్యోతిక సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తాజాగా మరో వీడియోను షేర్ చేస్తూ.. ఈ ప్రాంతాన్ని తమ 20వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు ఎందుకు ఎంచుకున్నారో వివరించారు. స్కాట్లాండ్‌లోని వాతావరణం తమ ప్రేమ ప్రయాణంలోని ఎన్నో మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని ఆమె తెలిపారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు తమ మనసులకు ఎంతో దగ్గరగా అనిపించాయని జ్యోతిక చెప్పుకొచ్చారు. స్కాట్లాండ్‌లోని ప్రజల ఆప్యాయత, ప్రేమ తమను మరింత ఆకట్టుకున్నాయన్నారు. అక్కడి నుంచి గొప్ప జ్ఞాపకాలను వెంట తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

ఈ వీడియోను మీరు చూసేయండి.. 

Updated Date - Sep 21 , 2026 | 01:44 PM