సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాకాస: ‘స్నేక్ డ్యాన్స్’.. షేక్ చేస్తోంది..

ABN, Publish Date - Mar 21 , 2026 | 11:53 AM

‘కమిటీ కుర్రోళ్లు’ సూపర్ హిట్ చిత్రం తర్వాత నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. మానస శర్మ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 3న సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ ను మేకర్స్ మొదలుపెట్టారు. శనివారం ఈ  మూవీ నుంచి ‘స్నేక్ డ్యాన్స్’ అనే పాటను విడుదల చేశారు. ఇది ప్రమోషనల్ సాంగ్ లా  కనిపిస్తోంది. ఇందులో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపారు. చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఈ నాగిని డాన్స్ పై మీరు లుక్ వేయండి 

Updated Date - Mar 21 , 2026 | 11:55 AM