సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'సామి సామి' సింగర్ పాడిన జంగమయ్య ప్రోమో 

ABN, Publish Date - Feb 10 , 2026 | 03:57 PM

'పుష్ప' సినిమా లో 'సామి సామి' పాట  వింటే గుర్తొచ్చే పేరు.. మౌనిక యాదవ్.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఈ పాటను అద్భుతంగా పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో పాప్ ఆల్బమ్స్ తో అలరించిన మౌనికను ఈ ఒక్క పాట ఓవర్ నైట్ స్టార్ సింగర్ ని చేసింది. అయితే ఆమె ఎక్కువగా  ఆల్బమ్ సాంగ్స్‌, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూవుంటారు. మహా శివరాత్రి  సందర్భంగా  'జంగమయ్య' అంటూ సాగే ఓ పాటను ఆమె పాడారు. రాజేంద్ర కొండా సాహిత్యం అందించారు. హనీ గణేష్ సంగీత సారథ్యంలో మౌనిక యాదవ్, హనుమంతు యాదవ్ ఈ పాటను ఆలపించారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. 

Updated Date - Feb 10 , 2026 | 03:57 PM