Sing Geetham: ట్రైలర్ రిలీజ్ కూడా ప్రయోగమే!
ABN, Publish Date - Jun 15 , 2026 | 04:31 PM
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం 'సింగ్ గీతం'. ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా, ట్రైలర్ ను ఆదివారం రిలీజ్ చేశారు.
సినిమాకు ప్రమోషన్ గా ఎవరైనా ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు. కానీ నిత్య ప్రయోజశీలి సింగీతం శ్రీనివాసరావు ట్రైలర్ విడుదల విషయంలోనూ ప్రయోగం చేశారు. ఈ సినిమా శుక్రవారం విడుదలైతే... ట్రైలర్‌ను ఆదివారం గ్రాండ్ సక్సెస్ ప్రెస్ మీట్‌లో రిలీజ్ చేశారు. అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించిన 'సింగ్ గీతం' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నాగ్ అశ్విన్ దీనిని నిర్మించారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా హాజరై దానిని విడుదల చేశారు.