సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘సిగ్మా’ నుంచి రేజ్ ఆఫ్ సిగ్మా సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Sep 09 , 2026 | 05:52 PM

సందీప్ కిషన్‌ హీరోగా నటిస్తున్న సిగ్మా మూవీ నుంచి మరో పాట విడుదలైంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో తమిళనాడు సీఎం విజయ్‌ కొడుకు జేసన్ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘సిగ్మా' చిత్రం అక్టోబర్ 2న జనం ముందుకు రాబోతోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా మేకర్స్ రేజ్ ఆఫ్ సిగ్మా పాటని రిలీజ్ చేశారు. తమన్ అందించిన పవర్‌ఫుల్ మ్యూజిక్, సీన్ రోనాల్డ్ ఎనర్జిటిక్ వోకల్స్‌తో ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. విడుదలైన వెంటనే ఈ పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి:

Mahendragiri Vaarahi: 'మురారి'కి దీనికి సంబంధం లేదు!

Karunas: ఇప్పుడు నాకు పెద్దగా మార్కెట్ లేదు! కానీ నాతో సినిమాకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు

గురు స్వాములు, మాల ధారుల‌ను అవ‌మానిస్తారా.. అయ్యప్ప భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

Updated Date - Sep 09 , 2026 | 05:56 PM