Dasari: దాసరి సమాధి పరిస్థితి ఎలా ఉందో చూడండి..
ABN, Publish Date - May 30 , 2026 | 01:45 PM
టాలీవుడ్ అగ్ర దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు తొమ్మిదవ వర్ధంతి నేడు. మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
టాలీవుడ్ అగ్ర దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayanarao) తొమ్మిదవ వర్ధంతి నేడు. మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన భార్య దాసరి పద్మ జ్ఞాపకంగా అక్కడే పద్మం రూపంలో సమాధిని కట్టించారు. ఆ పక్కనే దాసరి స్మారకం, విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేసిన దాసరి స్మారక (Dasari Memorial) స్థలం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూస్తే షాకవుతారు. చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో నిండి దిక్కు తోచని స్థితిలో ఉంది. శనివారం ఆయన వర్ధంతి అయినా కుటుంబ సభ్యులు కనీసం పట్టించుకోలేదు. ముళ్ల పొదల మధ్య ఉన్న దాసరి మెమోరియల్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉందో మీరూ చూడండి..