Ego Raja: రవితేజ వదిలిన ‘ఇగో రాజా’ టీజర్‌

ABN, Publish Date - Nov 20 , 2026 | 05:24 PM

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఈగో రాజా’. గురుశరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఈగో రాజా’. గురుశరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌ టీజర్‌ను మాస్‌ మహారాజా రవితేజ విడుదల చేయగా, తమిళ వెర్షన్‌ను విజయ్‌ సేతుపతి సోషల్‌ మీడియా వేదికగా ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇక టీజర్‌ విషయానికి వస్తే.. ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్న లోన్‌ యాప్‌ల మోసాలు, వాటి కారణంగా సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో రుణాలు అందిస్తామంటూ ఆకర్షించి, ఆ తర్వాత వేధింపులకు పాల్పడే లోన్‌ యాప్‌ల చుట్టూ కథ తిరగనున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. సామాజిక అంశానికి వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ కథను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో సతీశ్‌, శరణ్య రామచంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌జీఎస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై జి. సురేష్‌ నిర్మిస్తున్నారు.  

Updated at - Nov 20 , 2026 | 06:08 PM