సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tortoise: 'రంగు రంగు రంగు పిల్లరో..' లిరికల్ సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Nov 11 , 2026 | 06:13 PM

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న  సినిమా 'టార్టాయిస్'  సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో..' లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న  సినిమా "టార్టాయిస్". అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు.  బుధవారం ఈ  సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో..' లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఎనర్జిటిక్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, ప్రముఖ జానపద గాయకుడు పెంచల్ దాస్ లిరిక్స్ రాసి పాడారు.  ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, సింగర్, లిరిసిస్ట్ పెంచల్ దాస్ పర్ ఫార్మ్ చేయడం విశేషం.

Updated Date - Nov 11 , 2026 | 06:17 PM