Rajinikanth: ‘మనసిలాయో’ పాటకు రజనీకాంత్ అదిరిపోయే స్టెప్పులు!

ABN, Publish Date - Nov 12 , 2026 | 12:21 PM

సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, కావ్యా మారన్‌ వివాహ వేడుకలో రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌(Anirudh), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్యా మారన్‌9kavya Maran) వివాహ వేడుక గ్రీస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంగీత్‌ కార్యక్రమంలో ఆయన తనదైన శైలిలో సందడి చేశారు. 

‘వేట్టయాన్‌’ చిత్రంలోని ‘మనసిలాయో’ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ అందరినీ అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్‌ ఉత్సాహంగా స్టెప్పులేయడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!

Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?

Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..

Jyothika: మా పరిధిని మరింతగా విస్తరించే ధైర్యాన్ని ఇచ్చారు

Updated at - Nov 12 , 2026 | 12:46 PM