సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Raja saab: ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్

ABN, Publish Date - Jan 01 , 2026 | 09:55 AM

కొత్త సంవత్సరంలో ప్రారంభం కాగానే ప్రభాస్‌ తన అభిమానులకు  సర్ప్రైజ్ ఇచ్చారు.  ప్రస్తుతం ఆయన అభిమానులు ఖుషీగా ఉన్నారు. వరుస అప్‌డేట్స్‌తో  పండగ చేసుకుంటున్నారు. తాజాగా విడుదల చేసిన ‘స్పిరిట్‌’ ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకుల్ని అలరించింది.  ఫాన్స్ ఆ సందడిలో ఉండగానే ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab) నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘రాజే యువరాజే..’ ఆడియో సాంగ్‌ను గురువారం  విడుదల చేశారు. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. టిజి విశ్వప్రసాద్ నిర్మాత జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ  సినిమా.

Updated Date - Jan 01 , 2026 | 11:01 AM